ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య | IIIT Student Commit Suicide | Sakshi
Sakshi News home page

ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

Dec 3 2013 4:32 AM | Updated on Nov 9 2018 4:36 PM

నిజామాబాద్ జిల్లా బడా భీమ్‌గల్ గ్రామానికి చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని గురజాల స్రవంతి (19) ఆత్మహత్యకు పాల్పడింది.

 భీమ్‌గల్, న్యూస్‌లైన్: నిజామాబాద్ జిల్లా బడా భీమ్‌గల్ గ్రామానికి చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని గురజాల స్రవంతి (19) ఆత్మహత్యకు పాల్పడింది. ఈమె ఆదిలాబాద్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో మూడో సంవత్సరం చదువుతోంది. మొదటి సెమిస్టర్ పరీక్షలు పూర్తికాగా కళాశాల యాజమాన్యం శీతాకాలం సెలవులు ప్రకటించడంతో స్రవంతి వారం క్రితం స్వగ్రామానికి వచ్చింది. అయితే సోమవారం ఉదయం ఐదు గంటల సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. చదువులో ఎప్పుడూ టాపర్‌గా ఉండే ఆ విద్యార్థిని ఆత్మహత్యకుగల కారణాలు తెలియరాలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement