అవసరమైతే ఆమరణదీక్ష చేస్తా: పవన్ కల్యాణ్
గుంటూరు జిల్లాలో రాజధాని ప్రాంత పర్యటనలో ఉన్న సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
	గుంటూరు: గుంటూరు జిల్లాలో రాజధాని ప్రాంత పర్యటనలో ఉన్న సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే రాజధాని ప్రాంత రైతుల కోసం ఆమరణదీక్ష చేపడతానన్నారు. ఆయన గురువారం ఏపీ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పర్యటిస్తున్నారు. బేతపూడిలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజధాని కోసం 8 వేల ఎకరాలు సరిపోతాయని తాను భావిస్తున్నట్టు చెప్పారు. రైతుల కన్నీళ్లతో సింగపూర్ తరహా రాజధాని అవసరమా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
	
	
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
