breaking news
bethapudi
-
అ‘ధర’గొడుతున్న మల్లెలు
సాక్షి, అమరావతి: సువాసనలు వెదజల్లుతూ మధురానుభూతులు పంచే మల్లెలు పెరిగిన ధరలతో వినియోగదారుల ముక్కుపుటాలను అ‘ధర’గొడుతున్నాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో వాటి ధర పెరగడంతో కొనడానికి వినియోగదారులు జంకుతున్నారు. పూల కొట్ల వద్ద మూర మల్లెపూలను రూ.30 నుంచి రూ.35కి, పూల మార్కెట్లో కిలో రూ.1000కి అమ్ముతున్నారు. గతంలో మూర రూ.10 నుంచి రూ.20లోపు, కిలో రూ.500 వరకూ ఉండేది. పండుగలు, శుభకార్యాల సమయంలో మాత్రం కొంచెం డిమాండ్ ఉండేది. ప్రస్తుతం అవేమీ లేకపోయినా మల్లెపూల ధరలు షాక్ కొడుతున్నాయి. మల్లెపూలు ఎక్కువగా సాగయ్యే రాజధానిలో ప్రభుత్వ భూసమీకరణ వల్ల సాగు తగ్గి ఉత్పత్తి పడిపోయింది. దీంతో డిమాండ్‌తోపాటు పూలకు రేటూ పెరిగింది. గతంలో రాష్ట్రంలో 12 వేల నుంచి 15 వేల ఎకరాల్లో మల్లె సాగు జరిగేది. ప్రస్తుతం 7 వేల ఎకరాలకే పరిమితమైంది. రాజధాని పరిధిలో ఉన్న మంగళగిరి మండలంలో నిడమర్రు, కురగల్లు, బేతపూడి మల్లె సాగుకు పెట్టింది పేరు. గతంలో ఈ మూడు గ్రామాల్లో సుమారు 4 వేల ఎకరాల్లో మల్లె తోటలుండేవి. ప్రస్తుతం అది 700 ఎకరాలకు పడిపోయింది. నిడమర్రులోనే గతంలో 1500 ఎకరాల్లో మల్లె తోటలుండేవి. ప్రస్తుతం 500 ఎకరాల్లో కూడా సాగు లేకుండాపోయింది. రాజధానికి భూములు తీసుకోవడంతో మల్లె తోటల స్థానంలో బీడు భూములు దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి తగ్గిందని రైతులు అంటున్నారు. గతంలో ఎకరానికి వెయ్యి క్వింటాలు మల్లెపూల దిగుబడి వచ్చేదని, కానీ ఇప్పుడు తగ్గిందని చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదు గతంలో తోటల్లో రైతులు కిలో మల్లె పూలను రూ.200కి వ్యాపారులకు అమ్మేవారు. వ్యాపారులు పూల కొట్లకు రూ.300 నుంచి రూ.400కి విక్రయించేవారు. మూర ధర రూ.10, రూ.15 ఉండేది. కానీ తోటలు తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగిపోయింది. గతంలో విజయవాడ, గుంటూరుతోపాటు హైదరాబాద్, బెంగళూరుకు ఇక్కడి నుంచే పూలు పంపేవారు. ప్రస్తుతం విజయవాడకే పూలు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో వడ్లపూడి, చీరాల, మైలవరం, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో మల్లె సాగు జరుగుతున్నా డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో రేటు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. రాజధాని పరిధిలో మూడు గ్రామాలతోపాటు పరిసర గ్రామాల్లో పూల సాగు తగ్గిపోవడంతో రైతులు, కూలీలు, ఉపాధి కోల్పోయారు. తోటలన్నీ పోయాయి మల్లె తోటలతో మా ఊరు కళకళలాడేది. అందరికీ పని దొరికేది. రాజధానికి చాలావరకూ భూములు పోవడంతో పనే లేకుండా పోయింది. గతంలో కిలో మల్లెలు రూ.150 నుంచి రూ.200కి అమ్మినప్పుడు బాగా లాభాలు వచ్చేవి. ఇప్పుడు రూ.500కి అమ్ముతున్నా గిట్టుబాటు కావడంలేదు. – భద్రారెడ్డి, మల్లె తోట రైతు, నిడమర్రు పనులు లేక కష్టాలు రోజూ రెండు, మూడు గంటలు పూలు కోసి రూ.80 సంపాదించేవాళ్లం. ఆ తర్వాత వేరే పని చేసుకునేవాళ్లం. ఇప్పుడు మల్లె తోటల్లో పని లేకుండాపోయింది. అరకొర పనితో ఏమీ ఉపయోగం ఉండడం లేదు. ఇతర పనులు కూడా లేక చాలా కష్టాలు పడుతున్నాం. –సుజాత, కూలీ, నిడమర్రు -
అమరావతిలో విధ్వంసకాండ
సాక్షి, అమరావతి: రాజధాని కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్న ఏపీ ప్రభుత్వం మరో దుశ్చర్యకు దిగింది. చేతికి వచ్చిన పంటలను నాశనం చేసి అన్నదాతల నుంచి భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడిలో బుధవారం సీఆర్డీఏ అధికారులు దౌర్జన్యాలకు దిగారు. దిగుబడికి వచ్చిన మల్లె తోటలను ధ్వంసం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను నాశనం చేయొద్దని అధికారులను రైతులు వేడుకున్నారు. తమకు కొంత సమయం ఇవాలని అభ్యర్థించినా అధికారులు కనికరించలేదు. చేసేదిలేక అధికారులను నిలదీశారు. తమకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పంట పొలాల జోలికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. తమ నుంచి భూములు తీసుకునే సమయంలో మల్లె తోటకు ఐదు లక్షలు నష్టపరిహరం ఇస్తామని చెప్పి, కేవలం లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని వాపోయారు. మంత్రులు గ్రామాల్లో పర్యటించి పదేపదే భూసేకరణ చేస్తామని బెదిరిస్తే భయపడి రాజధానికి భూములిచ్చామని వెల్లడించారు. తమ దగ్గర నుంచి భూములు తీసుకుని ఇచ్చిన హమీలు అమలు చేయ్యకుండా ప్రభుత్వం మోసం చేసిందని మల్లె తోట రైతులు మండిపడుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తర్వాత తమ తోటల జోలికి రావాలని డిమాండ్ చేశారు. -
మంగళగిరిలో రైతులకు ఆర్కే భరోసా
మంగళగిరి : గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే భూసేకరణ విషయమై రైతులకు భరోసా కల్పించారు. మండలంలోని బేతపూడి గ్రామంలో ఆదివారం ఆయన రైతులతో సమావేశమయ్యారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం భూమిని సేకరించలేదన్నారు. మూడు పంటలు పండే భూమిని సేకరించరాదని చట్టంలో మొదట్లోనే పేర్కొన్నారని వారికి చెప్పారు. ఈ విషయంలో ఆందోళన చెందవద్దని ఆయన రైతులకు సూచించారు. తాను అండగా ఉంటానంటూ ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. అవసరమైతే కోర్టుకు వెళదామని ఆయన పేర్కొన్నారు. -
అవసరమైతే ఆమరణదీక్ష: పవన్
-
అవసరమైతే ఆమరణదీక్ష చేస్తా: పవన్ కల్యాణ్
గుంటూరు: గుంటూరు జిల్లాలో రాజధాని ప్రాంత పర్యటనలో ఉన్న సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే రాజధాని ప్రాంత రైతుల కోసం ఆమరణదీక్ష చేపడతానన్నారు. ఆయన గురువారం ఏపీ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పర్యటిస్తున్నారు. బేతపూడిలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజధాని కోసం 8 వేల ఎకరాలు సరిపోతాయని తాను భావిస్తున్నట్టు చెప్పారు. రైతుల కన్నీళ్లతో సింగపూర్ తరహా రాజధాని అవసరమా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.