రాజీనామా చేస్తా - వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే | I Will resign - YSR CP MLA | Sakshi
Sakshi News home page

రాజీనామా చేస్తా - వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే

Nov 10 2015 1:14 AM | Updated on May 25 2018 9:20 PM

రాజీనామా చేస్తా -  వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే - Sakshi

రాజీనామా చేస్తా - వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే

బాక్సైట్ తవ్వకాలు ఆపేయక పోతే.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వైఎస్సార్ సీపీ నేత గిడ్డి ఈశ్వరి సోమవారం ప్రకటించారు.

బాక్సైట్ తవ్వకాలు ఆపేయక పోతే.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వైఎస్సార్ సీపీ నేత గిడ్డి ఈశ్వరి సోమవారం ప్రకటించారు. బాక్సైట్ తవ్వకాల ప్రదేశాన్ని పాడేరు ఎమ్మెల్యే సందర్శించారు. తన పదవికి రాజీనామా చేసి తానే మళ్లీ నిలబడతానని, తనతో పోటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాని, టీడీపీకి చెందిన మరెవరైనా పోటీ చేయవచ్చని చెప్పారు.

బాక్సైట్ మైనింగ్ ఎజెండాగా జరిగే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే.. చంద్రబాబు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ప్రభుత్వం బాక్సైట్ గనుల జోలికి రాకపోవడం మంచిదని హెచ్చరించారు. ఈ పర్యటనలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమరనాథ్ తదితర నేతలు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement