షర్మిల బస్సు యాత్రకు విశేష స్పందన | huge response to sharmila bus yatra celebrations | Sakshi
Sakshi News home page

షర్మిల బస్సు యాత్రకు విశేష స్పందన

Sep 14 2013 1:29 AM | Updated on Sep 1 2017 10:41 PM

సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తుతున్న తరుణంలో జిల్లాలో షర్మిల నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ బస్సుయాత్ర కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

సాక్షి ప్రతినిధి, ఏలూరు :
 సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తుతున్న తరుణంలో జిల్లాలో షర్మిల నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ బస్సుయాత్ర కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రజల అభీష్టానికి అనుగుణంగా సమైక్య రాష్ట్రం కోసం ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలతో కలిసి పోరాడుతోంది. ఉద్యోగ, విద్యార్థి, ఉపాధ్యాయ తదితర జేఏసీలు నిర్వహించే ఆందోళనలకు మద్దతు ప్రకటించి వారితోపాటు సమైక్య ఉద్యమంలో ఆ పార్టీ నేతలు, శ్రేణులు మమేకమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సమైక్య శంఖారావం పేరుతో బస్సుయాత్ర చేసి ఉద్యమాన్ని మరింత పదునెక్కించారు. ఏలూరులో జరిగిన సభ లో షర్మిల సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడిన తీరు సమైక్యవాదుల్లో కొత్త ఆలోచనల్ని రేకెత్తించింది. మరోవైపు జిల్లా నలుమూలల నుంచి ఇక్కడ జరిగిన బహిరంగ సభకు భారీ సం ఖ్యలో జనం హాజరుకావడంతో  సమై క్య ఉద్యమ ఉధృతి స్పష్టమయ్యింది.
 
  అన్ని వయసుల వారు, ఉద్యోగు లు, వ్యాపారులు, కులవృత్తుల వారు,  సమైక్య ఉద్యమంలో భాగస్వాములవుతున్నా అధికార, ప్రతిపక్ష పార్టీలు భిన్న వైఖరులతో ఇష్టానుసా రం వ్యవహరించడాన్ని జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సమైక్య ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా సీమాంధ్ర ప్రాంతానికి సరైన దన్ను లభించడంలేదని ఆందోళన చెం దుతున్న సమైక్యవాదులంతా వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఆమోదించి మద్దతు ప్రకటించాయి. ఈతరుణంలో నే షర్మిల రాక వారికి మరింత ఉత్తేజాన్నిచ్చింది.  షర్మిల పాల్గొన్న బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోపాటు ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలను సమైక్య వేది కలపైకి రానీయకపోవడంతోపాటు ఎక్కడపడితే అక్కడ నిలదీస్తున్న ప్రజ లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై మా త్రం ఆదరణ కనబరుస్తున్నారనడానికి ఇదే నిదర్శనం. సభలో పాల్గొనడమే కాకుండా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకులు ఉద్యమంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న వైఎస్సార్‌సీపీకి అభినందనలు తెలపడం విశేషం.
 
 ఆ పార్టీకే తమ పూర్తి మద్దతు ఉంటుంద ని వేదికలో భాగంగా ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. మరోవైపు సమైక్య శంఖారావం నేపథ్యంలోనే రాజకీయ సమీకరణలు  మారాయి. ఇప్పటికే కొల్లేరు ప్రజలు వైఎస్సార్‌సీపీకి మద్దతు ప్రకటించగా మిగిలిన కొల్లేరు పెద్దలు, ఇతర నాయకులు కూడా ఈ సభలో పార్టీలో చేరడంతో వైఎస్సార్ సీపీకి మరింత బలం పెరిగింది. కాంటూరు సమస్య పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరిన కొల్లేరు నాయకులు చివరికి ఈ సమస్యను పరిష్కరించగలిగేది వైఎస్సార్ సీపీయేనని నమ్మి పార్టీలో చేరడం విశేషం.
 
  కాంగ్రెస్ ఖాళీ
 షర్మిల సభ తర్వాత ఏలూరు నియోజ కవర్గంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయింది. కేంద్ర మంత్రి కావూరు, ఇతర నాయకుల అనుచరులు తప్ప డివిజన్లలో నాయకులు, క్యాడర్ పూర్తి స్థాయిలో వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆధ్వర్యంలో వారంతా షర్మిలకు జైకొట్టారు. కాం గ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి వైఎస్సార్‌సీపీలో చేరారు. షర్మిల యాత్రతో సమైక్య ఉద్యమం మరింత పదునెక్కిందని పలువురు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement