
తేల్చిచెప్పిన జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాదనలతో ఏకీభవించిన బెంచ్
షర్మిల చేసుకున్న షేర్ల అక్రమ బదిలీని నిలిపేయాలన్న పిటిషన్‌కు అనుమతి
షేర్ల బదిలీ అక్రమమేనని ఎన్‌సీఎల్‌టీ తుది ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన షేర్ల బదిలీ వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వాదనలతో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఏకీభవించింది. తన పేరిట, వైఎస్ భారతి పేరిట సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌లో ఉన్న షేర్లను తల్లి విజయమ్మ ద్వారా చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని, తమ అనుమతి లేకుండా, షేర్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లపై తమ సంతకాలు లేకుండా చేసుకున్న ఆ బదిలీ చెల్లదని, దాన్ని నిలిపివేయాలని అభ్యర్థిస్తూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వేసిన పిటిషన్‌ను బెంచ్ అనుమతించింది.
ఆ షేర్ల ట్రాన్స్‌ఫర్ చెల్లదంటూ... షర్మిలకు బదిలీ అయిన వాటాలను నిలుపుదల చేస్తూ మంగళవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. సరస్వతి కంపెనీలోని తమ షేర్లను తల్లి విజయమ్మ ద్వారా చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని ఎన్‌సీఎల్‌టీలో 2024, సెపె్టంబర్ 3న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కనీసం తమ సంతకాలు లేకుండా, ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు లేకుండా బదిలీ జరిగిందని చెప్పారు. దీన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలివ్వాలని ట్రిబ్యునల్‌ను కోరారు.
ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల తరఫునా సుదీర్ఘ వాదనలు విన్న రాజీవ్ భరద్వాజ్ (జ్యుడిషియల్), సంజయ్ పూరి (టెక్నికల్) సభ్యుల ధర్మాసనం ఈ నెల 15న తీర్పు రిజర్వు చేసి... మంగళవారం తుది ఉత్తర్వులు వెలువరించింది. పూర్తి జడ్జిమెంట్ వివరాలను నేడు అప్‌లోడ్ చేసే అవకాశం ఉంది.