తాటిచెట్లపాలెంలో పర్యటించిన వైఎస్ జగన్ | hudud cyclone: ys jagan mohan reddy visits tatichettapalem | Sakshi
Sakshi News home page

తాటిచెట్లపాలెంలో పర్యటించిన వైఎస్ జగన్

Oct 16 2014 11:09 AM | Updated on Jul 25 2018 4:07 PM

తాటిచెట్లపాలెంలో పర్యటించిన వైఎస్ జగన్ - Sakshi

తాటిచెట్లపాలెంలో పర్యటించిన వైఎస్ జగన్

విశాఖలో హుదూద్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడోరోజూ పర్యటిస్తున్నారు.

విశాఖ : విశాఖలో హుదూద్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడోరోజూ పర్యటిస్తున్నారు. ఆయన గురువారం ఉదయం తాటిచెట్లపాలెంలో పర్యటించిన బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.అలాగే ధర్మనగర్లో తుఫాను బాధితులను ఆయన పరామర్శించారు. మరోవైపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేయాలని వైఎస్ఆర్‌ సీపీ శ్రేణులకు వైఎస్ జగన్  పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement