వానరానికి జన్మదిన వేడుకలు | Hotel Owner Celebrate Monkey Birthday in Anantapur | Sakshi
Sakshi News home page

వానరానికి జన్మదిన వేడుకలు

Mar 9 2019 1:01 PM | Updated on Mar 9 2019 1:01 PM

Hotel Owner Celebrate Monkey Birthday in Anantapur - Sakshi

వానరంతో కేక్‌ కట్‌ చేయిస్తున్న దృశ్యం

అనంతపురం, సోమందేపల్లి: మండల కేంద్రం సోమందేపల్లిలోని వై జంక్షన్‌లో హోటల్‌ నిర్వహిస్తున్న రవి, గంగరత్నమ్మలు తాము పెంచుకున్న వానరానికి(కోతి) శుక్రవారం సాయంత్రం జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో ఓ కోతి మరణించగా.. దాని పిల్లను వీరు చేరదీసి పెంచుకుంటున్నారు. వానరానికి దుస్తులు వేసి బర్త్‌డే కేక్‌ కట్‌ చేశారు. జంతువులపై వారు కనబరచిన ప్రేమను పలువురు ప్రశంసించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement