అరకులో నిలిచిన బెలూన్‌ ఫెస్టివల్‌ | Hot Air Balloon Festival interrupted due to rain | Sakshi
Sakshi News home page

అరకులో నిలిచిన బెలూన్‌ ఫెస్టివల్‌

Nov 15 2017 10:28 AM | Updated on Aug 20 2018 3:54 PM

Hot Air Balloon Festival interrupted due to rain  - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అరకులోయలో నిర్వహిస్తున్న బెలూన్‌ ఫెస్టివల్‌ బుధవారం నిలిచిపోయింది. వర్షం, అల్పపీడనం కారణంగా నిర్వాహకులు రెండోరోజు బెలూన్లను పైకి పంపలేదు. 13 దేశాల నుంచి 16 బెలూన్లు ఈ ఫెస్టివల్‌ కోసం వచ్చాయి. అయితే సాయంత్రం వాతావరణం అనుకూలిస్తే బెలూన్‌ ఫెస్టివల్‌ నిర్వహించే అవకాశం ఉంది. కాగా ఈ ఉత్సవం రేపటితో ముగియనుంది. కాగా బెలూన్‌ రెయిడ్స్‌ కోసం తొలుత మూడు, నాలుగు ప్రాంతాలను పరిశీలించారు. చివరకు అరకు సమీపంలోని సుంకరమెట్టను ఎంపిక చేశారు.

అక్కడ నుంచి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపగూడ వరకు బెలూన్‌ రెయిడ్‌ చేసేందుకు నిర్ణయించారు. సముద్రమట్టానికి ఐదు వేల అడుగుల ఎత్తు వరకు బెలూనిస్టులు విహరిస్తారు. కానీ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వల్ల గాలుల ఉధృతి అధికంగా ఉండడంతో అంత ఎత్తులో ఎగిరేందుకు ఎంతవరకు వాతావరణం సహకరించలేదు. దీంతో ఎంతో ఆశగా బెలూన్ ఫెస్టివల్‌ తిలకించేందుకు వచ్చిన పర్యాటకులు నిరాశగా వెనుతిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement