విజయనగరంలో బొత్స ఇంటి వద్ద ఉద్రిక్తత | High tension at botsa jhansi house in vizianagaram | Sakshi
Sakshi News home page

విజయనగరంలో బొత్స ఇంటి వద్ద ఉద్రిక్తత

Oct 3 2013 10:21 AM | Updated on Sep 1 2017 11:18 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విజయనగరం లోక్సభ సభ్యురాలు బొత్స ఝాన్సీ ఇంటిని గురువారం ఉదయం సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు ముట్టడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విజయనగరం లోక్సభ సభ్యురాలు బొత్స ఝాన్సీ ఇంటిని గురువారం ఉదయం సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు ముట్టడించారు. బొత్స ఝాన్సీ తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అయితే ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా అప్పటికే ఆమె నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

 

దాంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అయితే సమైక్యవాదులు,పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో ఇరువైపులా తోపులాట జరిగింది. ఆ తోపులాటలో ఓ ఉపాధ్యాయుడు గాయపడ్డాడు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి యనని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement