సాక్షి, తిరుమల: తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ పెరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లు, ప్రసాద కౌంటర్లు కిక్కిరి ఉన్నాయి. ప్రస్తుతం స్వామి వారిని దర్శించుకునే భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా, నడకదారి గుండా వచ్చే భక్తులకు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 76,577 మంది భక్తులు దర్శించుకున్నారు.