భారీ వర్షాల నష్టంపై..కేంద్ర బృందానికి నివేదిక | Heavy rains as Cyclone Helen Central team report | Sakshi
Sakshi News home page

భారీ వర్షాల నష్టంపై..కేంద్ర బృందానికి నివేదిక

Nov 24 2013 2:47 AM | Updated on Aug 20 2018 9:26 PM

గత నెలలో వారం రోజుల పాటు పడిన భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా రూ. 323 కోట్ల నష్టం వాటిల్లిందని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలిపారు.

 సాక్షి ప్రతినిధి, విజయనగరం : గత నెలలో వారం రోజుల పాటు పడిన భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా రూ. 323 కోట్ల నష్టం వాటిల్లిందని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలిపారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. నష్టాన్ని కేంద్రానికి నివేదించామని, రాష్ట్రం మొత్తానికి వాటిల్లిన నష్టానికి సంబంధించి ఇది వరకే కేం ద్రం నుంచి రూ. వెయ్యి కోట్లు అడ్వాన్సుగా తీసుకున్నామని తెలిపారు. హెలెన్ తుపాను వల్ల విజయనగరం డివిజన్‌లో పెద్దగా నష్టం లేనప్పటికీ పార్వతీపురం డివిజన్‌లో కోతలు కోసి కుప్పలుగా ఉంచిన చేలు నీట మునిగాయన్నారు. తుపాను వల్ల జిల్లాలో పెద్దగా నష్టం వా టిల్లనప్పటికీ ఎలాంటి పరిస్థితులనైనా..ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని అన్ని శా ఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. 
 
 కాగా రాష్ట్ర విభజనను ఆపాల్సిన కాంగ్రెస్ నేతలు ప్యాకేజీల గురించి మాట్లాడుతున్నారేమిటన్న విలేకరుల ప్రశ్నకు ఆయన తీ వ్రంగా స్పందించారు. ‘ప్యాకేజీ ఏమిటి... ప్యాకేజీ...ఇది కార్పొరేట్, వ్యాపారవర్గాలు వాడే పదం. మీరు ఇలా అడగడం మంచిది కాదు. ఒకవేళ రాష్ట్రం విడిపోవాల్సి వస్తే మన ప్రాంతానికి అన్యాయం జరక్కుండా చూడాల్సిన బాధ్య త మనపై ఉంది కదా...అందుకే అడుగుతున్నా రు.’ అన్నారు. ఇలాంటి విపత్తుల కారణంగా నష్టపోయిన వారందర్నీ ఖచ్చితంగా ఆదుకుం టామని స్పష్టం చేశారు. హెలెన్ తుపాను వల్ల విజయనగరంలో వాయిదా పడి న రచ్చబండ సభలను ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహిస్తామ ని చెప్పారు. ఆయనతో పాటు కలెక్టర్ కాంతి లాల్ దండే ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement