తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలో ఆదివారం భారీ వర్షం కురిసింది.
కాకినాడ టౌన్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల దాకా కుండపోతగా వర్షం పడింది. దీంతో కాకినాడ మెయిన్ రోడ్డులో మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచాయి. ఈ క్రమంలోనే ఈ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి.
నగరంలోని జగన్నాయకపూర్, ట్రెజరీకాలనీ, గోడారిగుంట, జె. రామారావుపేట తదితర ప్రాంతాల్లో వర్షం కారణంగా భారీగా నీరు నిలిచిపోయింది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.