తెలంగాణలో విధ్వంసానికి బాబే కారణం | hara gopal fires on chandra babu nadiu | Sakshi
Sakshi News home page

తెలంగాణలో విధ్వంసానికి బాబే కారణం

Feb 17 2014 3:33 AM | Updated on Jul 28 2018 6:33 PM

తెలంగాణలో విధ్వంసానికి బాబే కారణం - Sakshi

తెలంగాణలో విధ్వంసానికి బాబే కారణం

చంద్రబాబునాయుడి తొమ్మిదేళ్ల పాలనలో అమలు చేసిన ఆర్థిక విధానాలతో తెలంగాణ ప్రాంతం విధ్వంసానికి గురైందని పౌరహక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ జి.హరగోపాల్ ఆరోపించారు

టీటీఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్
 కామారెడ్డి, న్యూస్‌లైన్: చంద్రబాబునాయుడి తొమ్మిదేళ్ల పాలనలో అమలు చేసిన ఆర్థిక విధానాలతో తెలంగాణ ప్రాంతం విధ్వంసానికి గురైందని పౌరహక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ జి.హరగోపాల్ ఆరోపించారు. టీటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ‘నూతన తెలంగాణ కోసం మనం ఏం చేయాలి’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ ప్రపంచబ్యాంకు ఆదేశాల ప్రకారంగా చంద్రబాబు అమలు చేసిన విధానాలతో 1.20 కోట్ల ఉద్యోగాలు, 80లక్షలకు, ఆ తరువాత 40 లక్షలకు తగ్గిపోయాయన్నారు. వ్యవసాయ రంగం ఛిన్నాభిన్నమై వందలాదిగా రైతులు ఆత్మహత్య లకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఉపాధి లేక లక్షలాది మంది పట్టణాలకు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారని చెప్పారు. ఈ ప్రాంతంలోని 32 పరిశ్రమలను చంద్రబాబు ప్రభుత్వం మూసి వేయించడంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. సబ్సిడీలను ఎత్తివేసి అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేశారని అన్నారు. ఆక్రమణలకు గురైన లక్షలాది ఎకరాల భూములు, చెరువులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విడిపించాల్సిన అవసరం ఉందన్నారు.  
 
 నువ్వు కూడా గాడ్సేవా?
 ‘‘తెలంగాణ ఇస్తామని ప్రకటించినందుకు చంద్రబాబు సోనియాగాంధీని గాడ్సే అంటున్నారు. తెలంగాణ ఇచ్చేయమని ఉత్తరం ఇచ్చిన నువ్వు కూడా గాడ్సేవా ’’ అని హరగోపాల్ ప్రశ్నించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దోపిడీ విపరీతంగా జరిగిందని, ఉద్యోగాలు లేకుండాపోయాయని విమర్శించారు. ప్రజలకు వ్యతిరేకంగా పనిచే సినందుకే అధికారానికి దూరమైన విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నవాళ్లు వికృతంగా వ్యవహరిస్తారని, పార్లమెంటులో లగడపాటి వ్యవహ రించిన తీరు అందుకు నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో టఫ్ కో-కన్వీనర్ విమలక్క, టీపీఎఫ్ నేత వేదకుమార్, ప్రొఫెసర్ ఐలయ్య, ప్రొఫెసర్ తిరుమలి, టీటీఎఫ్ వ్యవస్థాపకుడు టి.హన్మాండ్లు, రాష్ట్ర అధ్యక్షుడు రాములు, తెరవే, టీఎల్‌ఎఫ్ బాధ్యులు ఎనిశెటి ్ట శంకర్, డాక్టర్ వీఆర్ శర్మ, డాక్టర్ వి.శంకర్, శ్యాంరావ్, వివిధ సంఘాల ప్రతినిధులు  పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement