breaking news
g hara gopal
-
ప్రజల పక్షాన మాట్లాడటం నేరమా?
వనపర్తి టౌన్: పాలనలో లోపాలను ఎత్తి చూపడం దేశం, రాష్ట్రంలో నేరంగా మారిందని పౌరహక్కుల నేత జి.హరగోపాల్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడం పాలకుల దృష్టిలో నేరంగా మారిందని ఆక్షేపించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం పాలమూరు అధ్యయన వేదిక నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దోపిడీదారులకు అనుకూలంగా పాలన సాగుతోందని, రైతులు అప్పులు తీర్చలేక పోతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రాణాలు విడిచిన 3 లక్షల మంది రైతులు ప్రభుత్వంపై తిరగబడి ఉంటే పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 19న హైదరాబాద్‌లో నీటి వాటాపై సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కర్ణాటక పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ నగరి బాబయ్య మాట్లాడుతూ.. గౌరీ లంకేష్ ప్రశ్నించేతత్వం, వాస్తవాలు రాసినందుకే రాజ్యం హత్య చేసిందని ఆరోపించారు. -
తెలంగాణలో విధ్వంసానికి బాబే కారణం
టీటీఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ కామారెడ్డి, న్యూస్‌లైన్: చంద్రబాబునాయుడి తొమ్మిదేళ్ల పాలనలో అమలు చేసిన ఆర్థిక విధానాలతో తెలంగాణ ప్రాంతం విధ్వంసానికి గురైందని పౌరహక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ జి.హరగోపాల్ ఆరోపించారు. టీటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ‘నూతన తెలంగాణ కోసం మనం ఏం చేయాలి’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ ప్రపంచబ్యాంకు ఆదేశాల ప్రకారంగా చంద్రబాబు అమలు చేసిన విధానాలతో 1.20 కోట్ల ఉద్యోగాలు, 80లక్షలకు, ఆ తరువాత 40 లక్షలకు తగ్గిపోయాయన్నారు. వ్యవసాయ రంగం ఛిన్నాభిన్నమై వందలాదిగా రైతులు ఆత్మహత్య లకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఉపాధి లేక లక్షలాది మంది పట్టణాలకు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారని చెప్పారు. ఈ ప్రాంతంలోని 32 పరిశ్రమలను చంద్రబాబు ప్రభుత్వం మూసి వేయించడంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. సబ్సిడీలను ఎత్తివేసి అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేశారని అన్నారు. ఆక్రమణలకు గురైన లక్షలాది ఎకరాల భూములు, చెరువులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విడిపించాల్సిన అవసరం ఉందన్నారు. నువ్వు కూడా గాడ్సేవా? ‘‘తెలంగాణ ఇస్తామని ప్రకటించినందుకు చంద్రబాబు సోనియాగాంధీని గాడ్సే అంటున్నారు. తెలంగాణ ఇచ్చేయమని ఉత్తరం ఇచ్చిన నువ్వు కూడా గాడ్సేవా ’’ అని హరగోపాల్ ప్రశ్నించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దోపిడీ విపరీతంగా జరిగిందని, ఉద్యోగాలు లేకుండాపోయాయని విమర్శించారు. ప్రజలకు వ్యతిరేకంగా పనిచే సినందుకే అధికారానికి దూరమైన విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నవాళ్లు వికృతంగా వ్యవహరిస్తారని, పార్లమెంటులో లగడపాటి వ్యవహ రించిన తీరు అందుకు నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో టఫ్ కో-కన్వీనర్ విమలక్క, టీపీఎఫ్ నేత వేదకుమార్, ప్రొఫెసర్ ఐలయ్య, ప్రొఫెసర్ తిరుమలి, టీటీఎఫ్ వ్యవస్థాపకుడు టి.హన్మాండ్లు, రాష్ట్ర అధ్యక్షుడు రాములు, తెరవే, టీఎల్ఎఫ్ బాధ్యులు ఎనిశెటి ్ట శంకర్, డాక్టర్ వీఆర్ శర్మ, డాక్టర్ వి.శంకర్, శ్యాంరావ్, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.