సక్సెస్‌ సందడి | Guna 369 Success Meet In Ongole | Sakshi
Sakshi News home page

సక్సెస్‌ సందడి

Aug 8 2019 11:26 AM | Updated on Aug 8 2019 11:31 AM

Guna 369 Success Meet In Ongole - Sakshi

మాట్లాడుతున్న గుణ 369 సినిమా హీరో కార్తికేయ, దర్శకుడు జంధ్యాల అర్జున్‌ తదితరులు

సినీ హీరో కార్తికేయ ఒంగోలు నగరంలో సందడి చేశారు.

సాక్షి, ఒంగోలు మెట్రో: స్థానిక రవి ప్రియా మాల్‌లో ‘గుణ 369’ చిత్ర బృందం బుధవారం సాయంత్రం సందడి చేసింది. ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ హీరో కార్తికేయ నటించిన ‘గుణ 369’ సినిమా విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ సినిమా విజయం చాలా సంతోషాన్ని ఇచ్చిందని, సినిమా షూటింగ్‌ దాదాపుగా ఒంగోలులోనే చేయటం శుభపరిణామమన్నారు. తర్వాత చిత్రం సొంత బ్యానర్‌లోనే తీస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సినిమా దర్శకుడు అర్జున్‌ జంధ్యాల, కమెడియన్‌ మహేష్, చిత్ర యూనిట్‌ పాల్గొనగా, మాల్‌ చైర్మన్‌ కంది రవి శంకర్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె. సాయినాథ్, మాల్‌ డైరెక్టర్‌ కె. విష్ణువర్ధన్, రేవంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement