ప్రయోగానికి సిద్ధమైన జీశాట్‌–11

GSAT ready for experimentation - Sakshi

ఇస్రో చరిత్రలోనే భారీ ఉపగ్రహం

శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) చరిత్రలోనే అత్యంత బరువు(5,725 కిలోలు) కలిగిన జీశాట్‌–  11 ఉపగ్రహాన్ని ఫ్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగిం చేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 25నే జరగాల్సిన ఈ ప్రయోగం సాంకేతిక కారణాలతో వాయిదా పడింది.

ఇంతకుముందు ఈ రికార్డు 3,477 కిలోల బరువైన జీశాట్‌–17 పేరిట ఉండేది. జీశాట్‌–17లో 42 ట్రాన్‌ఫాండర్లు అమర్చి పంపగా, జీశాట్‌–11లో 40 ట్రాన్స్‌ఫాండర్లు పంపనున్నారు. ఈ ప్రయోగాన్ని ఫ్రాన్స్‌లోని కౌరూ అంతరిక్షకేంద్రానికి చెందిన ఏరియన్‌–5 రాకెట్‌ ద్వారా పంపిస్తున్నారు. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని ఐసాక్‌ సెంటర్‌లో తయారు చేసి ప్రత్యేక విమానంలో ఫ్రాన్స్‌కు చేర్చారు. మే మొదటివారంలో ఈ ప్రయోగం నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top