అక్టోబర్ 14 నుంచి గ్రూప్ 2 ఇంటర్వ్యూలు | Group 2 interviews from October 14 | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 14 నుంచి గ్రూప్ 2 ఇంటర్వ్యూలు

Sep 25 2016 4:05 AM | Updated on Sep 2 2018 5:24 PM

అక్టోబర్ 14 నుంచి గ్రూప్ 2 ఇంటర్వ్యూలు - Sakshi

అక్టోబర్ 14 నుంచి గ్రూప్ 2 ఇంటర్వ్యూలు

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం 1999 గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి తిరిగి మెరిట్ జాబితా రూపకల్పన, ఇంటర్వ్యూలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక సర్వీస్ కమిషన్ ముహూర్తం ఖరారు చేసింది.

ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ వెల్లడి

 సాక్షి, హైదరాబాద్: సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం 1999 గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి తిరిగి మెరిట్ జాబితా రూపకల్పన, ఇంటర్వ్యూలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక సర్వీస్ కమిషన్ ముహూర్తం ఖరారు చేసింది. అక్టోబర్ 14 నుంచి 26 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.

శనివారం రాత్రి, లేదా  ఆదివారం ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్లో పొందుపర్చనున్నామని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్, కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి పేర్కొన్నారు. ఈ జాబితాను త్వరలోనే వెబ్‌సైట్లో పెట్టనుంది. తాజా జాబితా ప్రకారం 317 మంది కొత్తగా ఇంటర్వ్యూలకు ఎంపిక కానున్నారు. ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను వెబ్‌సైట్లో పొందుపర్చనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement