‘అమ్మ ఒడి’తో విద్యలో విప్లవాత్మక మార్పు 

Great Revolutions Will Come With Ammaodi - Sakshi

సాక్షి, ధర్మవరం :ఫ్యాను గుర్తుకు ఓటు వేసి, వేయించి వైఎస్సార్‌సీపీని గెలిపించండి.. అర్హులందరికీ ఇంటి స్థలం ఇచ్చి, పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని ఆపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేనేతలను అభ్యర్థించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన పట్టణంలోని 29 వార్డులో పర్యటించారు. ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటింటికీ తిరిగి ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని కోరారు.  

‘అమ్మ ఒడి’తో విద్యలో విప్లవాత్మక మార్పు 
పేద పిల్లలు ఎవరూ పనులకు వెళ్లరాదని, బడిఈడు పిల్లలు బడిలో ఉండాలని ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రవేశపెట్టారని కేతిరెడ్డి అన్నారు. కూలిపనికి పోతేగానీ పూటగడవని కుటుంబాలు ఎన్నో ఉన్నాయని, బడికి పంపాలంటే ఇబ్బందులు పడుతున్నాయని ఈ విషయాన్ని గుర్తించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిల్లలు ఎవరూ పనికి వెళ్లకూడదని ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని కేతిరెడ్డి అన్నారు. ఈ పథకం ద్వారా పిల్లలను బడులకు పంపే తల్లుల ఖాతాల్లోకి రూ.15,000 చొప్పున ఇద్దరికి రూ.30 వేలు వేస్తామన్నారు. మీ పిల్లలు ఎంత వరకు చదువుకుంటే అంతవరకు తామే ఉచితంగా చదివిస్తామని భరోసా ఇచ్చారు.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే చేనేత కార్మికులకు ప్రతి నెలా రూ.2వేలు ముడిపట్టు రాయితీ ఇస్తామని, ఎన్‌హెచ్‌డీసీ పథకాన్ని పునరుద్ధరించి ముడిరేషం కొనుగోలుపై 10శాతం రాయితీ ఇస్తామన్నారు. చేనేత బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించి, ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి, వైఎస్సార్‌సీపీని గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో వార్డు ఇన్‌చార్జ్‌ సరితాల బాషా, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ప్రజాసంక్షేమమే వైఎస్సార్‌సీపీ ధ్యేయం
ధర్మవరం : పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించే బాధ్యత తనదని,  వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే తీసుకొస్తామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భరోసానిచ్చారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని 25,26,22 వార్డుల ప్రజలతో సమావేశం నిర్వహించారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన టీడీపీ ప్రభుత్వం పేద ప్ర జలను  మోసం చేసిందన్నారు.   ఎమ్మెల్యే సూరికి కంకర, ఇసుక అమ్ముకోవడం తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదన్నారు. కేబుల్‌ సెటప్‌ బాక్స్‌ను రూ.2 వేలకు అమ్ముకున్నారన్నారు. కార్యక్రమంలో వార్డు ఇన్‌చార్జ్‌లు కుమారస్వామి, మాజీ కౌన్సిలర్‌ గోరకాటిపురుషోత్తంరెడ్డి, కత్తేపెద్దన్న, నాయకులు ఉడుముల రాము, రాయపాటి రామకృష్ణ, చేనేత నాయకులు దాసరి లక్ష్మినారాయణ, గడ్డం శ్రీనివాసులు, జయశ్రీ, కలిమిశెట్టిమురళి, పట్టణప్రముఖులు కుంటిమద్ది సుబ్రమణ్యం, గోరకాటి రఘునాథరెడ్డి, గోరకాటి చెన్నారెడ్డి, నాయకులు పోలా సుబ్రమణ్యం, మాధవరెడ్డి, పెద్దిరెడ్డిగారి శ్రీనివాసులులతోపాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, బూత్‌ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top