ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో 1,691 ఎకరాల్లో నిర్మాణాలను స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో 1,691 ఎకరాల్లో నిర్మాణాలను స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ సింగపూర్ కంపెనీలకు ఇంకా భూములను అప్పగించలేదన్నారు. సింగపూర్ కంపెనీలు డీపీఆర్ (సమగ్ర కార్యాచరణ ప్రణాళిక) మాత్రమే ఇచ్చాయని డీపీఆర్పై ఓపెన్ టెండర్లు పిలుస్తామని ఆయన తెలిపారు. జాతీయ కంపెనీలు కూడా టెండర్లలో పాల్గొనవచ్చని నారాయణ పేర్కొన్నారు.