పనితీరే పరమావధి | Government surveillance eyes on government physicians' performance | Sakshi
Sakshi News home page

పనితీరే పరమావధి

Aug 22 2017 3:36 AM | Updated on Sep 2 2018 4:52 PM

పనితీరే పరమావధి - Sakshi

పనితీరే పరమావధి

ప్రభుత్వ వైద్యుల పనితీరుపై ప్రభుత్వం నిఘా నేత్రాలు ఉంచనుంది. ప్రభుత్వ విధులకు డుమ్మా కొడు తూ సొంత క్లినిక్‌లపై ప్రేమ ఒలకబోస్తున్న వైద్యుల పని పట్టడానికి పాయింట్ల అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చింది.

శ్రీకాకుళం: ప్రభుత్వ వైద్యుల పనితీరుపై ప్రభుత్వం నిఘా నేత్రాలు ఉంచనుంది. ప్రభుత్వ విధులకు డుమ్మా కొడు తూ సొంత క్లినిక్‌లపై ప్రేమ ఒలకబోస్తున్న వైద్యుల పని పట్టడానికి పాయింట్ల అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. సమయ పాలన పాటించని వైద్యులపై ‘పెర్‌ఫార్మెన్స్‌’ అస్త్రాన్ని ప్రయోగించనుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలతో పాటు పట్టణాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న డాక్టర్ల పనితీరు తెలుసుకునేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోం ది.

 వారు రోగులకు అందిస్తున్న వైద్య సేవల ఆధారంగా పాయింట్లు ఇచ్చి వాటి ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వాలని యోచిస్తోంది. ప్రభుత్వం దీనిపై జారీ చేసిన ఈ ఉత్తర్వులపై వైద్యుల్లో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. విధులకు హాజరు కాని వారిలో ఆందోళన నెలకొనగా, చక్కగా పని చేస్తున్న వారు మాత్రం ఎవరి కోసమో తమను ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.  

పాయింట్లు ఇలా..
ప్రతి రోజు ఎంత మంది రోగులను పరీక్షించారు, హైరిస్కు ప్రెగ్నెన్సీ కేసులను ఎన్ని గుర్తించారు, వారికి అందించిన వైద్య సేవలు, ఇమ్యునైజేషన్‌ అమలు, తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్‌ సేవలు, ఎన్‌టీఆర్‌ బేబీకిట్, జననీసురక్ష యోజన పారితోషికం, నెలలో విధులకు హాజరైన రోజులు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం వంటి అంశాల ఆధారంగా వైద్యులకు పాయింట్లు ఇస్తారు. వీటి ఆధారంగా వైద్యాధికారులకు గ్రేడింగ్‌లు కూడా నిర్ణయిస్తారు. వీటిలో అంశాలకు 5, 2.5 మార్కులు కేటాయిస్తూ పాయింట్లను లెక్కిస్తారు. మొత్తం 100 మార్కులకు వైద్యాధికారుల పనితీరును ప్రతి నెలా లెక్క గట్టి, జిల్లా స్థాయిలో గ్రేడింగ్‌లు ఇస్తారు.

నెలలో ఒక వైద్యాధికారి కనీసం 2,500 మంది ఔట్‌ పేషెంట్లను పరీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెలా వైద్యులు వారి చేసిన పనిని జిల్లా స్థాయి అధికారులకు 10వ తేదీలోగా పంపిస్తే జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు వీటిని పరిశీలించి పాయింట్లు, గ్రేడింగ్‌లను కేటాయిస్తారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో పనిచేసే రెగ్యులర్, కాంట్రాక్టు వైద్యాధికారులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. విధుల్లో మంచి పనితీరు కనబరిచిన వైద్యాధికారులకు ప్రోత్సాహకాలను అందివ్వనున్నట్లు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. మార్కుల్లో ముందున్న వారికి నగదు రివార్డులు సైతం ఇద్దామని ఉత్తర్వుల్లో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement