ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన ఓ దాత రూ.1.75 లక్షల విలువైన బంగారపు సూత్రాలను కానుకగా అందజేశారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన ఓ దాత రూ.1.75 లక్షల విలువైన బంగారపు సూత్రాలను కానుకగా అందజేశారు. హిమాయత్‌నగర్‌కు చెందిన ఎం.వెంకటకృష్ణమూర్తి, మహాలక్ష్మి దంపతులు అమ్మవారికి బంగారపు నల్లపూసల దండ, సూత్రాలను కానుకగా సమర్పించాలని మొక్కుకున్నారు.
మహాలక్ష్మి బుధవారం అమ్మవారిని దర్శించుకున్నారు. బంగారపు సూత్రాలను అమ్మవారి దగ్గరుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ఏఈవో వెంకటరెడ్డికి అందించారు. సుమారు 31 గ్రాముల బంగారంతో నల్లపూసలు, తెల్లరాళ్లను పొదిగి సూత్రాలను తయారు చేయించినట్లు దాత తెలిపారు.