
ప్రతీకాత్మక చిత్రం
పోలీసులు సకాలంలో స్పందించి హుటాహుటిన 3 అడుగుల మేర కంకర రోడ్డు నిర్మాణం చేసి బస్సులను బయటకు తీసుకురావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద శుక్రవారం గోదావరి నది ఉధృతి పెరిగింది. కాడెమ్మ స్లయిజ్‌పై మూడు అడుగుల మేర వరద నీరు చేరింది. ఇదే సమయంలో ప్రాజెక్టు సందర్శనకు వచ్చి 12 బస్సులు చిక్కుకున్నాయి. పోలీసులు సకాలంలో స్పందించి హుటాహుటిన 3 అడుగుల మేర కంకర రోడ్డు నిర్మాణం చేసి బస్సులను బయటకు తీసుకురావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఉధృతంగా ప్రవహిస్తోన్న తుంగభద్ర
తుంగభద్ర నది శుక్రవారం ఉధృతంగా ప్రవహిస్తోంది. కర్నూలు జిల్లా సి.బెలగళ్ మండలం గుండ్రేవుల గ్రామంలో పంటపొలాలలోకి వరదనీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీట మునిగిన పంటపొలాలను కొడుమూరు వైఎస్సార్‌సీపీ ఇంచార్జి మురళి పరిశీలించారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.