గోడ కూలి బాలిక మృతి | girl died in an accident | Sakshi
Sakshi News home page

గోడ కూలి బాలిక మృతి

Feb 9 2015 5:00 PM | Updated on Sep 2 2017 9:02 PM

గోడ కూలి బాలిక మృతి

గోడ కూలి బాలిక మృతి

ఇంటిపై కప్పు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు గోడకూలి బాలిక మృతి చెందింది.

పశ్చిమగోదావరి : ఇంటిపై కప్పు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు గోడకూలి బాలిక మృతి చెందింది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం మల్లాయిగూడెం గ్రామపంచాయతీలోని ఏసీ అగ్రహారంలో సోమవారం జరిగింది. వివరాలు.. ఏసీ అగ్రహారానికి చెందిన గొంది శ్రీజ(8) పాఠశాలకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన మెండ్రు రమేష్ శిథిలావస్థలో ఉన్న తన ఇంటి కప్పును తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు గోడకూలి అటుగా వెళ్తున్న బాలికపై పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన అధికారులు ఎమ్మార్వో, ఎమ్‌డీవోలు సంఘటనాస్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement