కౌలురైతు ఆత్మహత్య | Former suicide | Sakshi
Sakshi News home page

కౌలురైతు ఆత్మహత్య

Oct 15 2015 2:34 PM | Updated on Oct 20 2018 6:04 PM

అప్పులు భారంతో మరో అన్నదాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అప్పులు భారంతో మరో అన్నదాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం తేడూరు గ్రామానికి చెందిన కౌలురైతు జానా గోపాల్(30) గురువారం ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే... గోపాల్ ఐదేళ్లుగా రెండెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.

పంటలు సరిగా పండక అప్పుల భారం పెరిగిపోవడంతో మనస్థాపం చెందిన గోపాల్ అందరూ పడుకున్న తర్వాత ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement