ఉన్మాది దాడి - ఐదుగురికి గాయాలు | five injured in Psycho attack | Sakshi
Sakshi News home page

ఉన్మాది దాడి - ఐదుగురికి గాయాలు

Oct 15 2015 2:39 PM | Updated on Sep 3 2017 11:01 AM

రైల్వే స్టేషన్‌లో అన్నం తింటున్న వారిపై ఓ ఆగంతకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు

రైల్వే స్టేషన్‌లో అన్నం తింటున్న వారిపై ఓ ఆగంతకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో గురువారం చోటుచేసుకుంది.

పట్టణానికి చెందిన కొందరు బిచ్చగాళ్లు స్థానిక రైల్వేస్టేషన్‌లో అన్నం తింటుండగా గుర్తు తెలియని ఓ వ్యక్తి వారిని కర్రతో విపరీతంగా కొట్టాడు. దీంతో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రయాణికులు రైల్వే పోలీసులకు చెప్పటంతో ఉన్మాదిని అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement