తిరుపతి ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఫైరింజన్‌ బోల్తా | fire engine overturned on runway of Tirupati International Airport | Sakshi
Sakshi News home page

తిరుపతి ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఫైరింజన్‌ బోల్తా

Jul 19 2020 2:52 PM | Updated on Jul 19 2020 3:05 PM

fire engine overturned on runway of Tirupati International Airport - Sakshi

సాక్షి, రేణిగుంట : తిరుపతి విమానాశ్రయంలో ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. రన్‌ వే పరిశీలనకు వెళ్లిన ఫైరింజన్‌ అదుపు తప్పి బోల్తా పడింది. అయితే అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి రావాల్సిన ఇండిగో విమానం లాండింగ్‌కు విమానాశ్రయ అధికారులు అనుమతి నిరాకరించారు. ఆ విమానాన్ని బెంగళూరుకు తరలించారు. మరోవైపు ఫైర్‌ ఇంజన్‌ బోల్తాపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కొద్దిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement