కాణిపాకంలోని హోటల్‌లో అగ్నిప్రమాదం | Fire Accident in Kanipakam Hotel | Sakshi
Sakshi News home page

కాణిపాకంలోని హోటల్‌లో అగ్నిప్రమాదం

Sep 10 2019 4:10 PM | Updated on Sep 10 2019 6:15 PM

Fire Accident in Kanipakam Hotel - Sakshi

సాక్షి, చిత్తూరు: కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ఉన్న జై గణేష్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి హోటల్‌లో ఉన్న నెయ్యి డబ్బాలకు అంటుకున్నాయి. దట్టమైన పొగలు అలముకోవడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హోటల్‌లోని సిలిండర్లను బయటకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement