అగ్నిప్రమాదం: భారీగా పంట నష్టం | fire accident in vizianagaram district | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదం: భారీగా పంట నష్టం

Feb 24 2016 4:07 PM | Updated on Sep 5 2018 9:45 PM

విజయనగరం జిల్లా బలిజపేట మండలంలోని బైరిపురం గ్రామంలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది.

విజయనగరం :  విజయనగరం జిల్లా బలిజపేట మండలంలోని బైరిపురం గ్రామంలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో  50 ఎకరాల్లో సాగుచేసిన పంటలు కాలి బూడిద అయ్యాయి. గ్రామంలోని సుమారు 30 కుటుంబాలకు చెందిన రైతులు ఒకే చోట యాభై ఎకరాల్లో మామిడి, చెరుకు, జీడి పంటలను సాగుచేశారు.

బుధవారం మధ్యాహ్నం పంటల వద్ద ఆకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది.  దీంతో రైతులు పంట వద్దకు చేరుకునేలోపే అది పూర్తిగా కాలిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement