గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీనర్సింహా స్వామి దేవాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది.
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీనర్సింహా స్వామి దేవాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం దేవాలయంలోని ఒక ఏసీలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో ఏసీ పూర్తిగా కాలిపోయింది. అప్రమత్తమైన ఆలయ సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.