మహిళలే బెస్ట్ : మంత్రులకు చంద్రబాబు క్లాస్! | Female ministers are Best :Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

మహిళలే బెస్ట్ : మంత్రులకు చంద్రబాబు క్లాస్!

Nov 16 2014 2:35 PM | Updated on Sep 2 2017 4:35 PM

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

మంత్రులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు.

హైదరాబాద్: మంత్రులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. కొంతమంది సీనియర్ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అధికారుల బదిలీల వ్యవహారంపై ఆయన సీరియస్ అయ్యారు. చంద్రబాబు ఈరోజు టెలీకాన్ఫరెన్స్లో మంత్రులతో మాట్లాడారు. అవినీతి ఆరోపణలు చాలా ఎక్కువగా వస్తున్నాయి, జాగ్రత్తగా వ్యవహరించడని వారిని హెచ్చరించారు.

బదిలీల విషయంలో రచ్చకెక్కడం సమంజసం కాదని హితవు పలికారు. ఈ విషయంలో పరువు తీస్తున్నారని ఆగ్రహించారు. బదిలీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించమని సలహా ఇచ్చారు. మహిళా మంత్రులే బెటరని చంద్రబాబు కితాబిచ్చారు. మహిళా, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి  పీతల సుజాతను ప్రశంసించారు. కొంతమంది మంత్రులు సీఎం కార్యాలయం జోక్యంపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement