తప్పించుకునేందుకు హెలికాప్టర్‌లో వెళ్లిన సీఎం | farmers' protest with black flags | Sakshi
Sakshi News home page

తప్పించుకునేందుకు హెలికాప్టర్‌లో వెళ్లిన సీఎం

Jan 2 2015 12:51 PM | Updated on Jun 4 2019 5:04 PM

తప్పించుకునేందుకు హెలికాప్టర్‌లో వెళ్లిన సీఎం - Sakshi

తప్పించుకునేందుకు హెలికాప్టర్‌లో వెళ్లిన సీఎం

రాజధాని ప్రాంతంలో రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. పంట భూములకు బదులు తమ ప్రాణాలు తీసుకోండంటూ ఏ ఆధికారి వచ్చినా తేల్చి చెబుతున్నారు.

తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంలో రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. పంట భూములకు బదులు తమ ప్రాణాలు తీసుకోండంటూ ఏ ఆధికారి వచ్చినా తేల్చి చెబుతున్నారు. నూతన సంవత్సర వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం తుళ్లూరు వెళ్తున్న విషయం తెల్సుకున్న ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులు చంద్రబాబుకు తమ నిరసన తెలియచేయూలని నిర్ణయించుకున్నారు.

అందులో భాగంగానే  ఇరుగ్రామాల పొలిమేర్లలో ల్యాండ్ పూలింగ్‌కు సహకరించేది లేదంటూ ఏర్పాటు చేసిన బోర్డుకు నల్లజెండాలు కట్టారు. అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రోడ్డు మార్గాన సీఎం చంద్రబాబు తుళ్లూరు వెళ్తే, తమ ఆవేదన స్వయంగా తెలియజేయాలని భావించారు. విషయం తెలుసుకున్న పోలీసులు బ్యారేజీవద్ద భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. కానీ సీఎం ఆకాశమార్గాన వెళ్లడంతో... తమ నిరసనకు భయపడి రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పించుకు వెళ్లారని రైతులు బహిరంగంగా విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement