నీవు చల్లగుండాలయ్యా.... | Farmers Meets YS Jagan in Praja Sankalpa Padayatra | Sakshi
Sakshi News home page

నీవు చల్లగుండాలయ్యా....

Jul 29 2018 7:26 AM | Updated on Oct 1 2018 2:24 PM

Farmers Meets YS Jagan in Praja Sankalpa Padayatra - Sakshi

ఎండనక వాననక కాలినడకన జనం మధ్యలో పాదయాత్ర చేస్తున్న జగన్‌కు పెద్దల ఆశీర్వాదాలందుతున్నాయి. పాదయాత్ర పొడవునా పెద్దలు తమదైన శైలిలో జగన్‌ను ఆశీర్వదిస్తున్నారు. ఏసీ గదుల్లో కూర్చున్నా చెల్లిపోయే జీవితం అయినా జనం కోసం కాలినడకన ముందుకు వస్తున్నారంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పాదయాత్రగా జగన్‌ జగ్గంపేట వైపు వెళ్తుండగా ఆటోలో కాలికి గాయమైన ఓ పెద్దాయన జగన్‌ను చూసేందుకు ఉత్సాహం చూపారు. రెండు చేతులు జోడించి ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్న జగన్‌ను చూసిన పెద్దాయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

Advertisement
 
Advertisement
Advertisement