అందుకే ఎస్‌ఈసీకి సుప్రీం ఆదేశాలు.. | Ys Jagan Meets With Key Ysrcp Leaders | Sakshi
Sakshi News home page

అందుకే ఎస్‌ఈసీకి సుప్రీం ఆదేశాలు..

Oct 22 2026 1:25 PM | Updated on Oct 22 2026 1:30 PM

Ys Jagan Meets With Key Ysrcp Leaders

సాక్షి, తాడేపల్లి: పార్టీ ముఖ్య నేతలతో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు, హింసపై సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హననంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిందని.. స్థానిక ఎన్నికల్లో అక్రమాలు, హింసను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుందని.. అందుకనే ఎస్‌ఈసీకి ఆదేశాలు ఇచ్చిందన్నారు.

‘‘చంద్రబాబు వ్యవస్థీకృతంగా ఉద్దేశ పూర్వకంగా హింసకు పాల్పడుతున్నారు. జరిగిన ఘటనలు ఈ అంశాన్ని నిర్థారిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా పరిస్థితిలో మార్పురాలేదు. ఎంపీటీసీ, జడ్పీటీసీల్లోనూ హింసకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నవారే హింసకు పాల్పడ్డం ఎక్కడా చూసి ఉండం. పోలీసులను వాడుకుని ఈ దారుణాలన్నీ చంద్రబాబు చేయిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయులు తిరుగులేని ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేదిశగా గొప్పగా పోరాటం చేస్తున్నారు’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

‘‘క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఘటనలపై ఆధారాలు సేకరణ చాలా అవసరం. పార్టీ నాయకులకు ఆమేరకు సూచనలు సలహాలు ఇవ్వండి. పటిష్ట ఆధారాలను కోర్టుల ముందు ఉంచడం ద్వారా న్యాయపోరాటం చేద్దాం. ప్రజాస్వామ్య పరిరక్షణ మన బాధ్యత. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎందాకైనా పోరాటం చేద్దాం’’ అని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: అరాచకాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement