వర్ష బీభత్సం | farmers losses due to untimely rains | Sakshi
Sakshi News home page

వర్ష బీభత్సం

Mar 3 2014 12:03 AM | Updated on Sep 2 2017 4:16 AM

అకాల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. రబీపై రైతులు పెట్టుకున్న ఆశలను వమ్ము చేసింది. గత మూడు రోజులుగా కురుస్తోన్న గాలివానకు జిల్లాలో భారీ విస్తీర్ణంలో పంటలు ధ్వంసమయ్యాయి.

 సాక్షి, సంగారెడ్డి: అకాల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. రబీపై రైతులు పెట్టుకున్న ఆశలను వమ్ము చేసింది. గత మూడు రోజులుగా కురుస్తోన్న గాలివానకు జిల్లాలో భారీ విస్తీర్ణంలో పంటలు ధ్వంసమయ్యాయి. ఈదురు గాలుల ఉధృతికి వందల ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు మొక్కలు నేలకు ఒరిగాయి.

మామిడి పూతలు, పిందెలు నేలరాలాయి. పంట నష్టంపై జిల్లా వ్యవసాయ శాఖ ఏ రోజుకారోజు అంచనా వేస్తోంది. వ్యవసాయ అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం.. శుక్రవారం ఒక్క రోజే జిల్లాలో 350 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, శనివారం కురిసిన వర్షానికి మరో 63 హెక్టార్ల విస్తీర్ణంలో నష్టం వాటిల్లింది. ఆదివారం సాయంత్రం కుండపోతగా వర్షం కురవడంతో నష్టం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆదివారం నాటి నష్టంపై సోమవారం అధికారిక లెక్కలు వెల్లడికానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement