కృష్ణాడెల్టా ప్రజల సాగు,తాగునీటికోసం పడుతున్నఇబ్బందులను అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావిస్తే అధికారపక్షం దాన్ని రాజకీయం అనడం దురదృష్టకరమని మాజీ మంత్రి పార్దసారథి విమర్శించారు.

రాష్ట్రపతి పాలనలో గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను సైతం అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఉండడం డెల్టా ప్రజల దురదృష్టమని ఆయన అన్నారు. టీడీపీ ప్రభుత్వ విధానాలు చూస్తే చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాల వల్ల అలాంటి పరిస్థితులే వస్తాయని కృష్ణాడెల్టా రైతాంగం భయాందోళనలో ఉందని పార్దసారథి విమర్శించారు.