పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య | farmer suicides of drinking poison in kurnool district | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

Jun 6 2015 11:33 AM | Updated on Oct 1 2018 2:36 PM

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

కర్నూలు (కోస్గి): పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోస్గి మండలం మూగులదొడ్డిలో శనివారం జరిగింది. మూడు రోజు క్రితం ఇంటి నుంచి బయలుదేరిన కురువ ఎల్లప్ప(30) అనే రైతు తన పొలంలో శవమై శనివారం కనిపించాడు. ఆయన పక్కన పురుగుల మందు డబ్బా ఉండటంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement