అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer commits suicide with debt | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Jan 23 2015 11:37 AM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి శుక్రవారం ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గిద్దలూరు: అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి శుక్రవారం ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం, బురుజుపల్లికి చెందిన వెంకటరెడ్డి(50) అనే రైతు రూ.15 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాడు. పొలంలో సాగుచేసిన పంట బాగుండటంతో అప్పులు అన్ని తీరుతాయనుకున్నాడు. కానీ బోరు బావిలో నీళ్లు ఎండిపోవడంతో పంట దిగుబడి తగ్గిపోయి అనుకున్న ఆదాయం రాలేదు. దీంతో తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్థాపం చెందాడు. పంట కోసం తెచ్చిన పురుగుల మందు తాగి వెంకటరెడ్డి పొలంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement