అప్పులబాధతో కౌలు రైతు ఆత్మహత్య | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో కౌలు రైతు ఆత్మహత్య

Jan 16 2016 4:51 PM | Updated on Nov 6 2018 7:56 PM

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం వేమలపాడు గ్రామానికి చెందిన ఈదయ్య(45) అనే కౌలు రైతు శనివారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

వెల్దుర్తి (గుంటూరు జిల్లా) : గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం వేమలపాడు గ్రామానికి చెందిన ఈదయ్య(45) అనే కౌలు రైతు శనివారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈదయ్య తనకున్న ఎకరం పొలంతోపాటు 7 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాడు. మిర్చి పంటలో వరుసగా నష్టాలు రావడం, అప్పులు ఇచ్చినవారి ఒత్తిడి పెరగడంతో మనస్థాపానికి గురై శనివారం సాయంత్రం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement