రైతు ఆత్మహత్యాయత్నం | Farmer attempts suicide in front of Tahsildar office | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యాయత్నం

Jan 25 2016 8:03 PM | Updated on Apr 4 2019 2:50 PM

కొండాపురం మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఉదయగిరి (నెల్లూరు జిల్లా) : కొండాపురం మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. అడంగల్‌లో తనకున్న పొలం వివరాలు నమోదు చేయనందుకు మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో కావలి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు తూర్పు ఎర్రవెళ్లి గ్రామానికి చెందిన కొండారెడ్డిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement