అనంతపురం నగరంలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు బుధవారం రట్టు చేశారు.
అనంతపురం: అనంతపురం నగరంలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు బుధవారం రట్టు చేశారు. ముఠాకు చెందిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు.