అంతర్ రాష్ట్ర రవాణా పన్ను విధానంపై హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
హైదరాబాద్ : అంతర్ రాష్ట్ర రవాణా పన్ను విధానంపై హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వాహనదారులు ప్రవేశపన్నును కట్టాల్సిందేని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అయితే రవాణా కమిషనర్ పేరుతో బ్యాంకు ఖాతా తెరిచి ఆ ట్యాక్స్ను వాహన యజమానులు అకౌంట్లో జమ చేయాలని సూచించింది.
న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వాహనదారులకు మాత్రమే ఈ తీర్పు వర్తిస్తుంది. మరోవైపు ప్రవేశ పన్ను (ఎంట్రీ ట్యాక్స్) పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాఖు వచ్చే వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్ను వసూలు చేయటంపై 280మంది వాహనదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.