అణు విద్యుత్‌లో తెలుగు రాష్ట్రాలు కీలకం | engineering staff college of india conducts workshop in hyderabad | Sakshi
Sakshi News home page

అణు విద్యుత్‌లో తెలుగు రాష్ట్రాలు కీలకం

May 12 2015 7:04 PM | Updated on Sep 4 2018 5:16 PM

దేశ అణు విద్యుత్ రంగంలో తెలుగు రాష్ట్రాలు కీలకపాత్ర పోషించనున్నాయని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) డెరైక్టర్ డాక్టర్ శేఖర్ బసు చెప్పారు.

హైదరాబాద్ : దేశ అణు విద్యుత్ రంగంలో తెలుగు రాష్ట్రాలు కీలకపాత్ర పోషించనున్నాయని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) డెరైక్టర్ డాక్టర్ శేఖర్ బసు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలో రెండో బార్క్ కేంద్రం నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతుండటం, తెలంగాణలోని నల్లగొండ జిల్లాలోని యురేనియం నిక్షేపాలను వెలికితీసేందుకు తాము సిద్ధంగా ఉండటం ఇందుకు నిదర్శనమని తెలిపారు. దేశంలో 'అణు విద్యుదుత్పత్తి అవకాశాలు- సవాళ్లు' అంశంపై ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన శేఖర్‌ బసు ఆ తరువాత విలేకరులతో మాట్లాడారు. భూ సేకరణ పూర్తయిన తరువాత మాత్రమే ఆరు అణు రియాక్టర్లతో కూడిన కొవ్వాడ కేంద్రం నిర్మాణంపై ఒక అంచనా వస్తుందని అన్నారు.

అదేవిధంగా విశాఖపట్నంలో 4 వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోయే రెండో బార్క్ కేంద్రం అత్యాధునిక టెక్నాలజీలకు నిలయంగా ఉంటుందని తెలిపారు. ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ స్థాయిలో అతిపెద్ద కేన్సర్ ఆస్పత్రిని నిర్మించే ఆలోచన కూడా ఉందని వివరించారు. నల్లగొండలోని పెద్దగట్టు, లంబాపూర్ ప్రాంతాల్లో.. కడప జిల్లాలోని తుమ్మలపల్లి క్షేత్రం కంటే నాణ్యమైన యురేనియం నిక్షేపాలు ఉన్నాయని వెల్లడించారు. తుమ్మలపల్లిలో లక్ష టన్నుల నిక్షేపాలుంటే.. నల్లగొండలో ఇది 18000 టన్నుల వరకూ ఉంటుందని సమావేశంలో పాల్గొన్న అడ్వాన్స్డ్ మెటీరియల్స్ డివిజన్ డెరైక్టర్ పరిహార్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement