విశాఖ వాతావరణ అధికారుల సమాచారంతో పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు
మత్య్సకారులు వేటకు వెళ్లొద్దు: సిద్దార్థ్ జైన్
May 9 2014 8:35 PM | Updated on Sep 2 2017 7:08 AM
ఏలూరు: విశాఖ వాతావరణ అధికారుల సమాచారంతో పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో రాగల 48 గంటలపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ సిద్దార్థ్ జైన్ అప్రమత్తం చేశారు.
మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ సూచనలు చేశారు. ఏలూరు కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
జార్ఖండ్, ఛత్తీస్‌గడ్, తెలంగాణ వరకూ అల్పపీడన ద్రోణి వ్యాపించిందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ-కర్ణాటక మద్య కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాయలసీమ, తెలంగాణ, ఉత్తరకోస్తాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement