గజరాజుల దాడులతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
చిత్తూరు: గజరాజుల దాడులతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని వి.కోట మండల పరిధిలోని పెద్దూరు, నారాయణతండా, రామాపురం తండాలలో రెండు రోజుల నుంచి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున 22 ఏనుగులు పంటపొలాలపై దాడులు చేశాయి. ఏనుగుల ధ్వంసంతో టమాట, బీన్స్ పంట నామరూపాల్లేకుండా పోయింది. దీంతో గ్రామస్తులు భయంతో ఇళ్లను నుంచి బయటకు రావడంలేదు. పంటల నష్టంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
(వి.కోట)