రామకుప్పంలో ఏనుగుల భీభత్సం | elephants attack on fileds in chittoor distirict | Sakshi
Sakshi News home page

రామకుప్పంలో ఏనుగుల భీభత్సం

Aug 12 2015 12:48 PM | Updated on Oct 2 2018 6:42 PM

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగులు భీభత్సం సృష్టిస్తున్నాయి.

రామకుప్పం: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగులు భీభత్సం సృష్టిస్తున్నాయి. గుట్టూరుతండాకు చెందిన ఒక రైతు ఏనుగుల దాడిలో గాయపడ్డాడు. తండాకు చెందిన గోపాల్‌నాయక్ మంగళవారం రాత్రి వేరుశెనగ చేనుకు కాపలాగా వెళ్లగా ఏనుగుల గుంపు పంటను ధ్వంసం చేసింది. అదే క్రమంలో అక్కడున్న గోపాల్‌నాయక్‌ పై దాడి చేసిన ఏనుగు తీవ్రంగా గాయపరిచింది. క్షతగాత్రుడిని కుప్పం ఆస్పత్రికి తరలించారు.

అదేవిధంగా ఏనుగుల గుంపు గ్రామానికి పొరుగునే ఉన్న పందేలమడుగు, గొల్లపల్లి గ్రామాల రైతులు సాగు చేసిన టమాటా, వరి, చెరుకు పంటలను ధ్వంసం చేశాయి. గత నెల రోజులుగా రాత్రి వేళల్లో ఈ గ్రామాలపై ఏనుగులు విరుచుకుపడుతున్నాయి. వాటి కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. అటవీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement