విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | electric shock kills worker in viazianagaram | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Jun 27 2015 10:30 AM | Updated on Sep 5 2018 2:26 PM

కరెంట్ షాక్‌తో వ్యక్తి చనిపోయిన సంఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలోని ఆంజనేయపురంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.

విజయనగరం: కరెంట్ షాక్‌తో వ్యక్తి చనిపోయిన సంఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలోని ఆంజనేయపురంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. మండల పరిధిలోని గరివిడి గ్రామానికి చెందిన దన్నాన శ్రీనివాసులు అలియాస్ రాజు(40)అనే కూలి ఓ మైనింగ్ యజమాని ఇంట్లో పనిచేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇంటి ఆవరణ శుభ్రం చేస్తుండగా..కరెంటు తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement