25 కిలోల వానపాములు పట్టివేత | Earthworms caught in nellore distirict | Sakshi
Sakshi News home page

25 కిలోల వానపాములు పట్టివేత

Aug 15 2015 2:16 PM | Updated on Oct 20 2018 6:19 PM

అక్రమంగా తరలిస్తున్న వానపాములను శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వద్ద పులికాట్ వన్యప్రాణి విభాగం అధికారులు శనివారం మధ్యాహ్నం పట్టుకున్నారు.

సూళ్లూరుపేట: అక్రమంగా తరలిస్తున్న వానపాములను శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వద్ద పులికాట్ వన్యప్రాణి విభాగం అధికారులు శనివారం మధ్యాహ్నం పట్టుకున్నారు. పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి తడ మండలం వేనాడు నుంచి బైక్‌పై 25 కిలోల వానపాములను గోనె సంచిలో తరలిస్తుండగా మండలంలోని దావాదిగుంట వద్ద అధికారులు అడ్డుకున్నారు. అయితే నాగేంద్ర పరారయ్యాడు. వానపాములను స్వాధీనం చేసుకుని, అతనిపై కేసు నమోదు చేశారు. గతంలో నాగేంద్ర వన్యప్రాణి విభాగంలో ఉద్యోగిగా పని చేశాడు.


 

Advertisement
 
Advertisement
Advertisement