ఈ ఏడాది ఎంసెట్ షెడ్యూల్ ప్రకటించారు. మే 17న ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారు.
హైదరాబాద్: ఈ ఏడాది ఎంసెట్ షెడ్యూల్ ప్రకటించారు. మే 17న ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారు. అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 20న ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌లు తీసుకోవడం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 4 ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణకు చివరితేది. జూన్ 2న ఎంసెట్ ర్యాంకులను ప్రకటిస్తారు.