
సాక్షి, అనంతపురం : హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యవహార శైలిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యేకు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన డ్వాక్రా మహిళలకు నిరాశే మిగిలింది. ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం వారిని చూసీ కూడా చూడనట్లుగా కారులో వెళ్లిపోయారు. అంతేకాకుండా వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళ్లిన ప్రజల పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించి పక్కకు నెట్టేశారు. దీంతో బాలకృష్ణతో పాటు పోలీసులు తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల సమస్యలు వినేందుకు కూడా ఎమ్మెల్యేకు తీరిక లేదా అని ప్రశ్నిస్తున్నారు.